ఆ బౌన్సర్‌కు హెల్మెట్‌ సెపరేట్‌ అయ్యింది..!

24 Apr, 2021 00:13 IST|Sakshi

హరారే: పేస్‌ బౌలర్లు వేసే బౌన్సర్లకు బ్యాట్స్‌మెన్‌ గాయపడటం తరచు చూస్తూ ఉంటాం. మరి బౌన్సర్‌కు హెల్మెట్‌ రెండు భాగాలు కావడం చూశారా.  పాకిస్థాన్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇక్కడ బ్యాట్స్‌మన్‌కు ఏమీ గాయాలు కాకపోయినా బంతి తగిలి హెల్మెట్‌ అవుటర్‌ లేయర్‌ లేచి నేలపై పడటం కలవరపాటుకు గురిచేసింది. 

పాకిస్థాన్‌ తరఫున అరంగేట్రం చేసిన పేస్‌ బౌలర్‌ అర్షద్‌ ఇక్కాల్‌ వేసిన రెండో ఓవర్‌ లో భాగంగా ఓ బంతిని జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ తినాషే కామున్హుకామ్వే  హిట్‌ చేయబోగా అది అతని హెల్మెట్‌కు తగిలింది. హెల్మెట్‌కు తగలడమే తరువాయి పైన ఉన్న లేయర్‌ ఒక్కసారిగా ఊడి కిందపడింది. హెల్మెట్‌ రెండు ముక్కలైనట్లు తొలుత అనిపించినా అది పైన ఉన్న అవుటర్‌ లేయర్‌ కాబట్టి బ్యాట్స్‌మన్‌ తినాషేకు గాయం కాలేదు. కాగా, అది చూసిన వారికి ఒళ్లు కాస్త గగుర్పాటుకు గురైంది. 

ఇదిలా ఉంచితే, టీ20 ఫార్మాట్‌లో పాక్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది జింబాబ్వే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో టీ20లో 19 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్ధిని కనీసం మూడంకెల స్కోర్‌ కూడా చేయనీయకుండా ఆలౌట్‌ చేసింది.

మరిన్ని వార్తలు