'బులెట్‌ వేగం'తో మార్క్రమ్‌ను దెబ్బకొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

19 Jan, 2022 16:27 IST|Sakshi

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా డెబ్యూ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ సూపర్‌ త్రోతో మెరిశాడు. అతని దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఎయిడెన్‌ మార్ర్కమ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ నాలుగో బంతిని మార్క్రమ్‌ మిడాఫ్‌ దిశగా ఆడాడు. రిస్క్‌ అని తెలిసినప్పటికి బవుమాకు సింగిల్‌కు కాల్‌ ఇచ్చాడు. దీంతో మార్ర్కమ్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లోకి చేరుకునేలోపే వెంకటేశ్‌ అయ్యర్‌ బంతిని అందుకొని డైరెక్ట్‌ త్రో వేశాడు. క్రీజుకు కొన్ని ఇంచుల దూరంలో మార్క్రమ్‌ ఉండగా.. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడం బిగ్‌స్క్రీన్‌పై కనిపించింది. ఇంకేముంది మార్క్రమ్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

చదవండి: డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్‌

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మార్క్రమ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తొలి వన్డేలో 58 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన మార్క్రమ్‌ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రిస్క్‌ అని తెలిసినా అనవసర పరుగుకు యత్నించి చేజేతులా మార్క్రమ్‌ రనౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్‌ తీయాలో చెప్పవా?: చహల్‌ భావోద్వేగం

>
మరిన్ని వార్తలు