Barbora Krejcikova: 'మోస్ట్‌ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి డిఫెండింగ్ చాంపియన్‌ ఔట్‌

26 May, 2022 15:36 IST|Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్బరా క్రేజీకోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అనూహ్యంగా వైదొలిగింది. ఇప్పటికే సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన క్రేజీకోవా.. తాజాగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో డబుల్స్‌ మ్యాచ్‌ ఆడకుండానే టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో డబుల్స్‌ టైటిల్‌ను నిలుపుకోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి.  ఈ విషయాన్ని క్రేజీకోవా 'దురదృష్టవంతురాలిని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మెడికల్‌ అప్‌డేట్‌ను షేర్‌ చేసుకుంది.

''మంగళవారం రాత్రి కాస్త అలసటగా అనిపించింది. తెల్లారి చూసేసరికి కొద్దిగా జ్వరం వచ్చినట్లయింది. దీంతో టెస్టుకు వెళ్లగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయం తెలియగానే వెంటనే టోర్నీ నుంచి వైదొలిగాను. సింగిల్స్‌ ఓడిపోయాను.. కనీసం డబుల్స్‌ టైటిల్‌ నిలుపుకుందామనుకున్నా.. కానీ బ్యాడ్‌లక్‌ కుదరలేదు''అంటూ ఎమెషనల్‌ అయింది. కాగా కేజ్రీకోవాతో పాటు చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి మేరీ బౌజ్కోవా కూడా ఆరోగ్య కారణాలతో రెండో రౌండ్‌ సింగిల్స్‌ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది.

కాగా సోమవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో బార్బరా క్రేజీకోవా 19 ఏళ్ల డైన్‌ పారీ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కేజ్రీకోవా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాంపియన్‌గా నిలిచింది.  సింగిల్స్‌ ఫైనల్లో అనస్తాసియా పావ్లియుచెంకోవాను ఓడించి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సినికోవాతో జతకట్టి ఫైనల్లో గెలిచిన కేజ్రీకోవా డబుల్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. కాగా మేరీ పియర్స్‌ తర్వాత ఒక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సింగిల్స్‌, డబుల్స్‌ విజేతగా నిలిచిన రెండో మహిళగా కేజ్రీకోవా నిలిచింది.

చదవండి: Nikhat Zareen-Mary Kom: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది

French Open 2022: మూడో రౌండ్‌లోకి నొవాక్‌ జొకోవిచ్‌

మరిన్ని వార్తలు