ఐపీఎల్‌లో మరో పాజిటివ్‌!

15 Apr, 2021 06:05 IST|Sakshi

కరోనా బారిన ఢిల్లీ బౌలర్‌ నోర్జే

నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు దూరం

ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బౌలర్‌ యాన్రిచ్‌ నోర్జేకు నిర్వహించిన తొలి ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. బుధవారం నోర్జేకు నిర్వహించిన రెండో ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టు ఫలితం ఇంకా రాలేదు. దాంతో గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు నోర్జే దూరం కానున్నాడు. అయితే నోర్జేకు పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు.

‘నోర్జే కరోనా నిర్ధారణ పరీక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అతను క్వారంటైన్‌లోనే ఉన్నాడు’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రతినిధి తెలిపాడు. నోర్జేతో ఈనెల 6న కలిసి వచ్చిన దక్షిణాఫ్రికాకే చెందిన మరో బౌలర్‌ కగిసో రబడకు నెగెటివ్‌ వచ్చింది. దాంతో అతను ఢిల్లీ జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అక్షర్‌ పటేల్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), దేవ్‌దత్‌ పడిక్కల్, డానియల్‌ సామ్స్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) కరోనా బారిన పడ్డారు.

మరిన్ని వార్తలు