మార్చి 30 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రైనింగ్‌ షురూ..

20 Mar, 2021 17:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)2021 ఎడిషన్‌ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించగా.. త్వరలో గత సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా శిబిరాన్ని మొదలుపెట్టనుంది. ఈనెల 23లోపు ఆటగాళ్లనంతా బయోబబుల్‌లోకి హాజరుకావాలని, మార్చి 30 నుంచి శిక్షణ శిబిరం ప్రారంభంమవుతుందని ఫ్రాంచైజీ కార్యనిర్వాహాకాధికారి వినోద్‌ బిస్త్‌ వెల్లడించారు. 

పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో రిఫ్రెషమెంట్‌ కోసం వారి కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడిపేందుకు క్యాంప్‌ను ఆలస్యంగా నిర్వహించాలనుకున్నామని ఆయన తెలిపారు. ఆటగాళ్లు బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ జట్టులో ఈ ఏడాది కొత్తగా స్టీవ్‌ స్మిత్‌, సామ్‌ బిల్లింగ్స్‌, ఉమేశ్‌ యాదవ్‌ జాయిన్‌ కానున్నారు. కాగా, ఈ ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఢీకొట్టనుంది.

ఢిల్లీ జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌, సామ్‌ బిల్లింగ్స్‌, విష్ణు వినోద్‌, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, శిఖర్‌ ధవన్‌, అజింక్య రహానే, షిమ్రోన్‌ హెట్మేయర్‌, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌, అశ్విన్‌, స్టోయినిస్‌, క్రిస్‌  వోక్స్‌, టామ్‌ కర్రన్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, రబాడ, నోర్జే, అమిత్‌ మిశ్రా, రిపల్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, లుక్మాన్‌ మేరీవాలా, మనిమరన్‌ సిద్ధార్ధ్‌, ప్రవీణ్‌ దూబే

మరిన్ని వార్తలు