DC vs CSK Qualifier 1: ‘ఫైనల్‌’ వేటలో...

10 Oct, 2021 05:26 IST|Sakshi

నేడు ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌

ఢిల్లీ, చెన్నై మధ్య పోరు

సా.గం.7.30నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

గత రెండేళ్లుగా పురోగతి సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం ఈ సారి టైటిలే! 2019లో ప్లే ఆఫ్స్‌కు చేరి మూడో స్థానంలో నిలిచిన జట్టు గతేడాది ఫైనల్‌ వరకు వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడూ ఫైనల్‌ చేరి ఆపై లక్ష్యాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై ప్లే ఆఫ్స్‌ కొత్త కాదు. మూడు సార్లు చాంపియన్‌. అయితే గతేడాది లీగ్‌లోనే ని్రష్కమించిన చేదుఅనుభవాన్ని ఈసారి టైటిల్‌తో చెరిపేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మొదటి అడుగు ఫైనల్‌పై దృష్టి పెట్టింది.

దుబాయ్‌: ముందుగా ప్లే ఆఫ్స్‌ చేరుకున్న జట్ల మధ్య ముందుగా ఫైనల్‌ తేల్చుకునే మ్యాచ్‌ నేడు జరుగనుంది. ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తలపడనుంది. లీగ్‌ దశలో ఢిల్లీనే టాపర్‌. ఏ జట్టూ గెలవనన్ని మ్యాచ్‌లు గెలిచింది. క్యాపిటల్స్‌ జట్టు ఆల్‌రౌండ్‌ సత్తాతో దూసుకొచి్చంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో నేరుగా ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు చెన్నై టాపార్డర్‌తోనే నెట్టుకొచి్చంది.

అనుభవజ్ఞులకు కొదవలేకపోయినా... ఈ సీజన్‌లో ఆ ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు అసలైన సమరం మొదలు కావడంతో తప్పకుండా ధోని సేన సిసలైన ఆటతీరును ప్రదర్శించడం ఖాయం. కాబట్టి చెన్నై కూడా మరో మ్యాచ్‌ దాకా వేచి చూడకుండా ఈ విజయంతోనే తుది పోరుకు చేరేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది.

అక్కడ... ఇక్కడ... ఢిల్లీదే పైచేయి  
ఈ సీజన్‌లో ఢిల్లీ దూసుకెళ్తోంది. కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్‌ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలి దశ పోటీలు జరిగిన భారత్‌లో, రెండో అంచె జరుగుతున్న యూఏఈలో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై క్యాపిటల్స్‌దే పైచేయి. ముంబైలో చెన్నైని ఓడించిన పంత్‌ సేన ఇక్కడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

ఓపెనింగ్‌లో పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందిస్తే... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో చక్కబెట్టేందుకు కెపె్టన్‌ పంత్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. ఆ తర్వాత స్లాగ్‌ ఓవర్లలో హెట్‌మైర్, స్టొయినిస్‌ మెరుపులు జట్టుకు భారీస్కోరును కట్టబెడతాయి. ఇక బౌలింగ్‌లో రబడ, నోర్జేలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకరంగా మారారు. కుర్రాడు అవేశ్‌ ఖాన్‌ కూడా బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. స్పిన్నర్లలో అనుభవజు్ఞడైన అశ్విన్, అక్షర్‌ పటేల్‌లు అవసరమైనపుడు బ్యాట్లతోనూ ఇన్నింగ్స్‌ను నడిపించడం ఢిల్లీకి అదనపు బలం.

ఓపెనర్లపైనే భారం
మరోవైపు చెన్నై బ్యాటింగ్‌ బలంతో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్‌ల్లో జట్టు భారమంతా రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్‌ అలీ మెరిపిస్తున్నాడు. అనుభవజు్ఞడైన సురేశ్‌ రైనా వైఫల్యం వల్ల రాబిన్‌ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ధోని మార్క్‌ ఇన్నింగ్స్‌ ఈ సీజన్‌లో ఇంకా బాకీ ఉంది.

ఈ మ్యాచ్‌లో అతని నుంచి ‘విజిల్‌ పొడు’చే ఇన్నింగ్స్‌ ఆవిష్కృతమైతే తప్పకుండా చెన్నై అభిమానులకు పండగే! బ్రావో ‘ఎక్స్‌ట్రా’ల బౌలింగ్‌ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్‌ల్లో బ్రావో ధారాళంగా పరుగులు సమరి్పంచుకోవడంతో పాటు ఎక్స్‌ట్రాల రూపంలో విరివిగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. శార్దుల్‌ ఠాకూర్, హాజల్‌వుడ్‌లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్‌తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్‌ చెన్నై వీరంగం చేస్తే కష్టాలు తప్పవు.

జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, శ్రేయస్‌ అయ్యర్, హెట్‌మైర్, రిపాల్‌ పటేల్, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్‌ ఖాన్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌: ధోని (కెపె్టన్‌), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప/సురేశ్‌ రైనా, జడేజా, బ్రావో, శార్దుల్‌ ఠాకూర్, దీపక్‌ చహర్, హాజల్‌వుడ్‌.

మరిన్ని వార్తలు