రెజ్లర్‌ హత్యకేసు: సుశీల్‌ కుమార్‌ రిమాండ్‌ పొడిగింపు

29 May, 2021 17:42 IST|Sakshi

ఢిల్లీ: జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఒలింపియన్‌.. రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు మరో నాలుగు రోజుల రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం తెలిపింది. కాగా ఢిల్లీ పోలీసులు సుశీల్‌ను విచారించేందుకు ఏడు రోజుల కస్టడీకి కోరగా.. కోర్టు నాలుగు రోజలు మాత్రమే పొడిగించింది. సుశీల్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న అజయ్‌కి ప్రతీరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కాగా మే 23న కోర్టులో హాజరుపరిచిన సుశీల్‌కు ఆరు రోజుల రిమాండ్‌ విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో కోర్టు మరోసారి రిమాండ్‌ను పొడిగించినట్లు స్పష్టం  చేసింది. 

కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగ‌ర్ రాణా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. సుశీల్‌, సాగ‌ర్ వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సాగ‌ర్ హ‌త్య‌కు గురైన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు. అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్‌ కుమార్‌ను పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హాకీ స్టిక్‌తో సాగర్‌ రాణాపై దాడికి పాల్పడినట్లుగా రిలీజైన వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్‌ హాకీ స్టిక్‌తో... 

మరిన్ని వార్తలు