IND vs SL: కేఎల్‌ రాహుల్‌కు బిగ్‌ షాకిచ్చిన బీసీసీఐ.. హార్దిక్‌ పాండ్యాకు ప్రమోషన్‌!

28 Dec, 2022 00:08 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బీసీసీఐ బిగ్‌ షాకిచ్చింది. రాహుల్‌ను భారత జట్టు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తొలిగించింది. అతడి స్థానంలో స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నియమించింది.

స్వదేశంలో  శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌తో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.

కాగా చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీకి ఇదే ఆఖరి జట్టు ఎంపిక కావడం గమానార్హం. ఇక టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ దూరమయ్యారు.  యువ పేసర్లు ముఖేష్‌ కుమార్‌, శివమ్‌ మావికి తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది.

అదేవిధంగా ఈ సిరీస్‌కు రోహిత్‌ దూరం కావడంతో హార్దిక్‌ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపిక అయ్యాడు. ఇక రోహిత్‌, విరాట్‌, కేఎల్‌ రాహుల్‌ తిరిగి వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులో చేరనున్నారు. అయితే గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.

లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్

లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్
చదవండి: 
సివిల్స్‌ క్లియర్‌ చేసిన టీమిండియా క్రికెటర్‌ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు