దిగజారిన కోహ్లి, రాహుల్.. దుమ్మురేపిన కాన్వే

31 Mar, 2021 15:45 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌  దిగజారాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక స్థానం దిగజారి 762 పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా.. కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం దిగజారి 743 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో 52 బంతుల్లోనే 92 పరుగులతో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్‌ ఆటగాడు డెవొన్‌ కాన్వే 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. ఇక ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ 892 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకోగా.. ఆరోన్‌ ఫించ్‌(830 పాయింట్లు), బాబర్‌ అజమ్‌( 801 పాయింట్లు) రెండు.. మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక బౌలింగ్‌ విభాగంలో టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్‌ 10లో చోటు సంపాదించలేకపోయారు. 733 పాయింట్లతో తబ్రియాజ్‌ షంషీ టాప్‌ లేపగా.. అప్ఘన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 719 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆసీస్‌ బౌలర్‌ ఆస్టన్‌ అగర్‌ 702 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్‌ విభాగంలో ఆఫ్ఘన్‌కు చెందిన మహ్మద్‌ నబీ 285 పాయింట్లతో మొదటి స్థానం.. బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 248 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 226 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక టీమ్‌ విభాగంలో ఇంగ్లండ్‌(272 పాయింట్లు)  టాప్‌ స్థానంలో నిలవగా.. భారత్‌ 270 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా 267 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
చదవండి: 
‘పంత్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది’

ఐపీఎల్‌ 2021: వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు