ధోనికి ఇచ్చే గౌరవం ఇదేనా: అఫ్రిది

12 Oct, 2020 14:11 IST|Sakshi

ఢిల్లీ: ధోని కూతురు జీవాపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. 'ధోని, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతడు భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయిని తీసుకెళ్లాడు. తన జర్నీలో సీనియర్స్‌, జూనియర్స్‌ ఆటగాళ్లను కలుపుకొని ముందుకు వెళ్లాడు. ధోని పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గౌరవం అనిపించుకోదు' అని షాహిద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు. ప్లేయర్స్‌ సరిగ్గా ఆడకపోతే కుటుంబ సభ్యులను విమర్శించడం ఏంటని మండిపడ్డాడు. 

కోలకతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపొయిన విషయం తెలిసిందే. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని సోషల్‌ మీడియాలో జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 


(ఇదీ చదవండి: జీవాపై కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు