ఐపీఎల్‌-2020 బెస్ట్‌ ఎలెవన్‌‌.. ధోనికి నో ప్లేస్‌!

14 Sep, 2020 15:10 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)చరిత్రలో బెస్ట్‌ కెప్టెన్లు ఎవరంటే మనకు ఠక్కున గుర్తుచ్చేది రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనిలు. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ ప్రకటించిన అత్యుత్తమ ఐపీఎల్‌ ఎలెవన్‌లో రోహిత్‌ శర్మ స్థానం దక్కించుకున్నాడు కానీ ధోనికి మాత్రం చోటు దక్కలేదు. అదే సమయంలో టీ20 స్పెషలిస్టు ఆటగాళ్లైన ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌లు కూడా బ్రాడ్‌హాగ్‌ స్థానం కల్పించలేదు. దీనిపై బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ.. ‘ ధోని, డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌లను నా ఐపీఎల్‌ అత్యుత్తమ జట్టులో ఎంపిక చేయలేదు. వీరు ‘పాత’బడ్డారు. వీరికి మ్యాచ్‌ను టర్న్‌ చేసే సామర్థ్యం ఉంది. కానీ వీరు వెటరన్‌లు కావడంతో చోటు కల్పించలేదు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ముగిసేసరికి నా జట్టు ఇలా ఉంటుంది’ అని తన యూట్యూట్‌ చానల్‌లో ప్రకటించాడు.( చదవండి: ‘కోహ్లి.. ఇకనైనా జట్టు ఎలా ఉండాలో తెలుసుకో’)

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు బెస్ట్‌ ఐపీఎల్‌-20 టీమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చాడు హాగ్‌. గతంలో ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా చేసిన విలియమ్సన్‌కు సారథిగా ఎంచుకున్నాడు. ఇక అదే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ వార్నర్‌ను ఓపెనర్‌గా తీసుకున్నాడు. వార్నర్‌కు జతగా రోహిత్‌ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్‌డౌన్‌ ఆటగాడిగా విరాట్‌ కోహ్లిని సెలెక్ట్‌ చేశాడు. కీపర్‌గా రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేసిన హాగ్‌.. ఆల్‌రౌండర్‌ కోటాలో ఆండ్రీ రసెల్‌, రవీంద్ర జడేజా, సునీల్‌ నరైన్‌లను తీసుకున్నాడు. రసెల్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ కాగా, జడేజా, నరైన్‌లు స్పిన్నర్లు కావడంతో వీరికి ప్రాధాన్యత ఇచ్చాడు. యజ్వేం‍ద్ర చహల్‌కు కూడా హాగ్‌ జట్టులో చోటు దక్కింది. ఇక పేసర్లుగా  భువనేశ్వర్‌ కుమార్‌,  జస్‌ప్రీత్‌ బుమ్రాలను ఎంపిక చేశాడు. ఇక్కడ . ఏడుగురు భారత ఆటగాళ్లకు హాగ్‌ చోటు ఇచ్చిన హాగ్‌..  ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు నుంచి వార్నర్‌కు మాత్రమే అవకాశం ఇవ్వడం గమనార్హం.(చదవండి: ‘ఆ ఫాస్ట్‌ బౌలర్‌పైనే ధోని ఆశలు’)

హాగ్‌ బెస్ట్‌ ఐపీఎల్‌-2020 జట్టు ఇదే..
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, ఆండ్రీ రసెల్‌, రవీంద్ర జడేజా, సునీల్‌ నరైన్‌, యజ్వేంద్ర చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

మరిన్ని వార్తలు