అలా చేయడం అంత ఈజీ కాదు: ధోని

27 Oct, 2020 17:42 IST|Sakshi

దుబాయ్‌: తమిళనాడులోని గోపి కృష్ణన్ అనే ఓ అభిమాని సీఎస్‌కే కెప్టెన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంటిని సీఎస్‌కే జట్టు రంగైన పసుపు రంగులోకి మార్చేసి దానిపై ‘హోమ్‌ ఆఫ్‌ ధోని’ అని పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. (ధోని ఈజ్‌ బ్యాక్‌: సెహ్వాగ్‌)

దీనిపై తాజాగా ధోని స్పందించగా,  ఆ వీడియోను సీఎస్‌కే తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. తన వీరాభిమాని అయినన గోపీ కృష్ణన్‌ గురించి ధోని మాట్లాడుతూ.. ‘ ఆ ఫోటోలను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. అది నిజంగా చాలా గొప్పగా అనిపించింది. కేవలం అతను నా అభిమాని మాత్రమే కాదు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ అనే విషయం కూడా అక్కడ అర్ధమవుతుంది. అలా చేయడం అంతా ఈజీ కాదు. ఒక ఇంటి కలర్‌నే మార్చాలంటే మొత్తం కుటుంబమే ఒప్పుకోవాలి. ముందు కూర్చొని అంతా ఒప్పుకున్న తర్వాతే అలా చేయగలుగుతాం. అతను సీఎస్‌కేకు అతి పెద్ద అభిమాని అనే విషయం తెలుస్తోంది. అది కేవలం ట్వీటర్‌ పోస్టో.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టో కాదు. అది ఎప్పటికీ నిలిచిపోయేది’ అని ధోని పేర్కొన్నాడు. 

ఐపీఎల్‌–2020 సీజన్‌లో  లీగ్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా మూడుసార్లు మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) నిలిచింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినా... మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు గెలుపొందడంతో... చెన్నై జట్టుకు ప్లే ఆఫ్‌ దశ అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో చెన్నై జట్టు లీగ్‌ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది.

>
మరిన్ని వార్తలు