ఐపీఎల్‌ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?

30 Sep, 2020 19:42 IST|Sakshi

ఆగస్టు 15, 2020.. ఎంఎస్‌ ధో‌ని అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు బిగ్‌షాక్‌ ఇచ్చాడు. అయితే సెప్టెంబర్‌ 19నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కావడంతో ధోని మళ్లీ బిజీ అయ్యాడు. సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని జట్టుకు మరోసారి టైటిల్‌ అందించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ధోని ఏం చేస్తాడనేది అతని అభిమానుల్లో ప్రశ్న మెదులుతూ వస్తుంది. అయితే ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో బిజీ కానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ధోని భార్య సాక్షి ధోని పర్యవేక్షిస్తుంది. (చదవండి : ఆర్‌ఆర్‌ వర్సెస్‌ కేకేఆర్‌ : చెరో 10 విజయాలు)

కాగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో 2019లోనే సొంత బ్యానర్‌ను స్థాపించిన జార్ఖండ్‌ డైనమేట్‌ రోర్‌ ఆఫ్‌ ది లయన్‌ అనే డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దీనికి సంబంధించి న్యూ ప్రాజెక్ట్స్‌ను కూడా రూపొందించనున్నాడు. ఇదే విషయమై ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సాక్షి సింగ్‌ ధోని స్పందించారు. ఒక డెబ్యూ రచయిత రాసిన బుక్‌ పబ్లిష​కాకపోవడంతో దాని హక్కలు తాము కొనుగోలు చేశామని.. దానిని ఒక వెబ్‌ సిరీస్‌గా మలవనున్నాం. ఇది ఒక పురాణ సైన్స్ ఫిక్షన్ కథ..  ఇది ఒక రహస్యమైన అగోరి ప్రయాణాన్ని అన్వేషించనుంది. కథకు సంబంధించి పాత్రలు, డైరెక్టర్‌ను త్వరలోనే ఫైనలైజ్‌ చేస్తాం. ఐపీఎల్‌ తర్వాత ధోని కూడా నాతో పాటు నిర్వహణ బాధ్యతలు పంచుకోనున్నాడు. ధోనికి క్రికెట్‌ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని చాలా ఇష్టపడుతాడు. అందుకే రిటైర్మెంట్‌ తర్వాత ధోని ఏరికోరి ఈ రంగాన్ని ఏంచుకున్నాడు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరు మీద మంచి కార్యక్రమాలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి : ఐపీఎల్ 2020:‌ అయ్యర్‌కు భారీ జరిమానా)

కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ తడబడుతూనే ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయింది. రైనా, హర్బజన్ దూరమవడం.. రాయుడు గాయంతో ఆడకపోడం చెన్నై జట్టుకు శాపంగా మారింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు