#WTCFinal: చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?

10 Jun, 2023 19:56 IST|Sakshi

ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్‌లో ఇంత భారీ టార్గెట్‌ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్‌ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది.

టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా?
ఇక  టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్‌ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.

ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్‌ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్‌ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్‌ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది.

చదవండి: #NotOut: థర్డ్‌ అంపైర్‌ చీటింగ్‌.. గిల్‌ ఔట్‌ కాదు

మరిన్ని వార్తలు