Hockey India President: హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్‌ టిర్కీ..

23 Sep, 2022 19:57 IST|Sakshi
PC: INSIDE SPORT

హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ  ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ వేసిన రాకేష్‌ కాత్యాల్‌, బోలా నాథ్‌ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా టిర్కీ గెలుపొందాడు. కాగా హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది.  కానీ ఎంపిక ఏకగ్రీవం కావడంతో వారం రోజుల ముందే నిర్వహకులు ప్రకటించారు.

అయితే జాతీయ క్రీడా నియమావళిని హాకీ ఇండియా ఉల్లంఘించిందే అని చెప్పుకోవాలి. నేషనల్‌ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం.. ఎన్నికల తేదికు ముందు విజేతను ప్రకటించకూడదు. కాగా హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు నిర్వాహకుల కమిటీ సభ్యలకు టిర్కీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

కాగా 44 ఏళ్ల టిర్కీ 1998 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదే విధంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీగా  భోలా నాథ్ సింగ్, కోశాధికారిగా శేఖర్ జె. మనోహరన్ ఎంపికయ్యారు.
చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌..

మరిన్ని వార్తలు