T20 World Cup 2022: 'ఆ ముగ్గురు ఐపీఎల్‌లో అదరగొట్టారు.. భారత జట్టులో ఉండాల్సింది'

15 Sep, 2022 12:27 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ కోసం ఎటువంటి సంచలనాలకు తావివ్వకుండా దాదాపు ఆసియా కప్‌ ఆడిన జట్టునే సెలెక్టర్లు ఎంపికచేశారు. ఆసియాకప్‌కు దూరమైన బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.

కాగా టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపికచేసిన భారత జట్టుపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది జట్టు ఎంపికతో పూర్తిగా ఏకీభవిస్తున్నప్పటికీ.. మరి కొంత మం‍ది జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిందని భావిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ కెప్టెన్‌  దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా చేరాడు. 

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపం‍చకప్‌ భారత జట్టులో పేసర్లు మహ్మద్‌ షమీ, ఉమ్రాన్‌ మాలిక్‌, బ్యాటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌ ఉండి బాగుండేది అని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మార్క్యూ ఈవెంట్‌ కోసం భారత జట్టుకు​ స్టాండ్‌బైగా మహ్మద్‌ షమీ ఎంపికయ్యాడు.

ఈ నేపథ్యంలో వెంగ్‌సర్కార్ ఇండియన్‌ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడూతూ.. "నేను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో భాగమైంటే టీ20 ప్రపంచకప్‌కు ఖచ్చితంగా షమీ, ఉమ్రాన్‌ మాలిక్, గిల్‌ను ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారు.

అదే విధంగా వారికి టీ20 క్రికెట్‌లో రాణించే సత్తా కూడా ఉంది. ఇక భారత జట్టులో ఎవరూ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారన్నది నేను అంచనా వేయలేను. అది కెప్టెన్‌, కోచ్‌ ఇష్టం. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్యకుమార్‌ ఇకపై ఐదో స్థానంలో రావచ్చు. సూర్య భారత జట్టుకు గొప్ప ఫినిషర్‌ అవుతాడు" అని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
చదవండి: Babar Azam: అతడి కెరీర్‌ నాశనం చేస్తున్నారు! బాబర్‌ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్‌ ఏ టోర్నీ గెలవలేదు!

మరిన్ని వార్తలు