హాకీలో ఘోరంగా...

26 Jul, 2021 06:11 IST|Sakshi

ఓ రోజు ముందు మహిళల జట్టు కనబరిచిన పేలవమైన ప్రదర్శనను మరుసటి రోజు పురుషుల జట్టూ మన కళ్లముందుంచింది. పూల్‌ ‘ఎ’లో ఆదివారం జరిగిన రెండో లీగ్‌లో భారత జట్టు 1–7తో ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చవిచూసింది. మన్‌ప్రీత్‌ బృందం అన్ని రంగాల్లో విఫలమైంది. డిఫెండర్లు ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయారు. మన మిడ్‌ఫీల్డర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయారు. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను దిల్‌ప్రీత్‌ సింగ్‌ (34వ ని.లో) చేశాడు. ఆసీస్‌ శిబిరంలో బ్లేక్‌ గోవర్స్‌ (40వ, 42వ ని.) రెండు గోల్స్‌ చేయగా, డానియెల్‌ (10వ ని.), హేవర్డ్‌ (21వ ని.), అండ్రూ ఫ్లిన్‌ (23వ ని.), బెల్జ్‌ (26వ ని.), టిమ్‌ బ్రాండ్‌ (51వ ని.) తలా ఒక గోల్‌ చేశారు.

మరిన్ని వార్తలు