పొలార్డ్‌ను అనుసరించిన దినేష్‌ కార్తీక్‌‌

7 Oct, 2020 19:40 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో క్రికెట్‌ మజాను అందించడంతో పాటు మరొక​అంశం కూడా తెగ ఊపేస్తుంది. అదే 'బ్రేక్‌ ది బియర్డ్‌ చాలెంజ్‌'. ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యా మొదలుపెట్టిన ఈ బ్రేక్‌ ది బియర్డ్‌ చాలెంజ్‌ ఇప్పుడు యమ క్రేజ్‌ సంపాదించింది. మొదట పాండ్యా తన బియర్డ్‌ను తొలగించి విండీస్‌ విధ్వంసం కీరన్‌ పొలార్డ్‌కు చాలెంజ్‌ విసిరాడు. కాగా పొలార్డ్‌ పాండ్యా చాలెంజ్‌ను స్వీకరించి రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఫ్రెంచ్‌ కట్‌లో ఉన్న వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలో పొలార్డ్‌ గడ్డంతో కాకుండా ఫ్రెంచ్‌కట్‌తో న్యూలుక్‌లో దర్శనమిచ్చాడు. తర్వాత ఈ చాలెంజ్‌ను కేకేఆర్‌ కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ను నామినేట్‌ చేశాడు. (చదవండి : నయా చాలెంజ్‌.. కొత్త లుక్‌లో పొలార్డ్‌)

పొలార్డ్‌ చాలెంజ్‌ను స్వీకరించిన దినేష్‌ కార్తీక్‌ బుధవారం తన ఇన్‌స్టాలో దానికి సంబంధించిన వీడియోనూ షేర్‌ చేశాడు.  ఆ వీడియోలో మొదట గుబురు గడ్డంతో కనిపించిన కార్తీక్‌.. ఆపై ఫ్రెంచ్‌ కట్‌లో మెరిసాడు. కాగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దినేష్‌ కార్తీక్‌ అటు కెప్టెన్‌గానూ.. ఇటు బ్యాట్స్‌మన్‌గానూ విఫలమవుతూ వస్తున్నాడు. (చదవండి : 'ఈ సమయంలో గేల్‌ చాలా అవసరం')

@kieron.pollard55 Challenge accepted 😎 As the season intensifies, time to hit a new level & #breakthebeard. KKR 1 - MI 1. #korbolorbojeetbo #GameFaceOn #ipl #MIvsKKR @break_the_beard

A post shared by Dinesh Karthik (@dk00019) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు