ఈ నరైన్‌కు ఏమైంది !

8 Oct, 2020 16:04 IST|Sakshi

ఢిల్లీ: కోల్‌కతా​ నైట్‌ రైడర్స్‌ జట్టులో సునిల్‌ నరైన్‌ ఒక కీలక ఆటగాడు. బౌలింగ్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఎన్నో మ్యాచుల్లో ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభానిచ్చాడు. అలాంటిది ఈ సీజన్‌లో అతడి పేలవ ప్రదర్శన ఆ జట్టును కలవరపెడుతుంది. ఓపెనర్‌గా ఆడిన నాలుగు మ్యాచుల్లో (9, 0, 15, 3) చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. బౌలింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. కోల్‌కతా జట్టు కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ మాత్రం నరైన్‌ను సమర్థించాడు. బుధవారం చెన్నైతో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడాడు. 'నరైన్‌ మా జట్టులో కీలక ఆటగాడు. ఒక ఆటగాడిగా అతడిని చూసి గర్వపడుతున్నాను. రెండు మూడు పేలవ ప్రదర్శనలతో ఆటగాడి సామర్థ్యం తగ్గిపోదు. అతడిపై పూర్తి నమ్మకం ఉంది. రాహుల్‌ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించి నరైన్‌పై ఒత్తిడి తగ్గించాం. రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు' అని కార్తిక్‌ పేర్కొన్నాడు. 
చెన్నైతో జరిగిన మ్యాచులో నరైన్‌ స్థానంలో రాహుల్‌ త్రిపాఠి ఓపెనింగ్‌ చేశాడు. చెన్నైపై 10 పరుగుల తేడాతో నెగ్గడంలో రాహుల్‌ ఇన్నింగ్స్‌ కీలకం. 51 బంతుల్లో 81 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా మూడో స్థానానికి చేరుకుంది. 

(ఇదీ చదవండి: ఎంఎస్‌ ధోని ఫన్నీ వాక్‌)

>
మరిన్ని వార్తలు