Dinesh karthik: బౌలర్‌ యార్కర్‌ దెబ్బ..  క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్‌మన్‌

18 Sep, 2021 09:23 IST|Sakshi
Courtesy: కేకేఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) వైస్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో అదుపుతప్పాడు. కేకేఆర్‌ ఆటగాళ్లు అబుదాబిలోని మైదానంలో ప్రాక్టీస్‌ చేశారు. ఈ సందర్భంగా  కేకేఆర్‌ బౌలర్‌ కమలేష్‌ నాగర్‌కోటి యార్కర్‌ దెబ్బకు కార్తిక్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. నాగర్‌కోటి నుంచి వేగంగా వచ్చిన యార్కర్‌ బంతిని ఆడేందుకు కార్తిక్‌ సిద్ధమయ్యాడు. అయితే బంతి వేగంగా రావడంతో బ్యాట్‌తో క్లిక్‌ చేసే సమయంలో అదుపుతప్పి క్రీజులోనే కూలబడ్డాడు. అంతకముందు నాగర్‌కోటి యార్కర్‌ వేసే ప్రయత్నం చేయగా.. కార్తిక్‌ దానిని బౌండరీ తరలించాడు. దీంతో తర్వాతి బాల్‌ను నాగర్‌కోటి పర్‌ఫెక్ట్‌ యార్కర్‌గా దింపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కేకేఆర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మీటర్‌ రీడిండ్‌లో నాగర్‌ కోటీ వేసిన యార్కర్‌ వేగం గంటకు 98 కిమీగా నమోదవడం విశేషం

కాగా కేకేఆర్‌ ఈ సీజన్‌లో పడుతూ లేస్తే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడే సమయానికి మోర్గాన్‌ సారధ్యంలోని కేకేఆర్‌ 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో అంచె పోటీల్లోనైనా కేకేఆర్‌ తలరాత మారుతుందేమో చూడాలి. ఇక కేకేఆర్‌ రెండో ఫేజ్‌లో తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 20న ఆర్‌సీబీతో ఆడనుంది.

చదవండి: Rishab Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా పంత్‌ కొనసాగింపు 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

మరిన్ని వార్తలు