దినేశ్‌ కార్తీక్‌.. ఏం తిన్నావ్‌: మాజీ క్రికెటర్‌

10 Oct, 2020 20:17 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌(ఫోటో కర్టసీ; పీటీఐ)

అబుదాబి:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. చాలాకాలం తర్వాత కార్తీక్‌ బ్యాట్‌ నుంచి మంచి సొగసైన ఇన్నింగ్స్‌ వచ్చింది. అసలు కార్తీక్‌ ఎందుకు అన్నవారికి సమాధానం చెబుతూ 29 బంతుల్లో 58 పరుగులు సాధించాడు కార్తీక్‌. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంటే దినేశ్‌ కార్తీక్‌ సాధించిన పరుగుల్లో 44 పరుగులు ఫోర్లు, సిక్స్‌లు రూపంలోనే రావడం విశేషం. ఇంతటి మంచి ఇన్నింగ్స్‌ ఆడతాడని మ్యాచ్‌కు ఎవరూ ఊహించకపోవడంతో కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అటు మాజీలు, ఇటు ఫ్యాన్స్‌.  దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తనయుడు టీమిండియా మాజీ క్రికెటర్‌ రోహన్‌ గావస్కర్‌.. దినేశ్‌ కార్తీక్‌ స్ట్రోక్‌ ప్లే గురించి ఒక ట్వీట్‌ చేశాడు. ‘గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ దినేశ్‌ కార్తీక్‌. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడావ్‌.. ఇంతకీ ఈరోజు బ్రేక్‌ ఫాస్ట్‌ ఏమి చేసి మ్యాచ్‌కు సిద్ధమయ్యావో తెలుసుకోవాలనుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు. ఇదొక అసాధారణమైన ఇన్నింగ్స్‌ అంటూ కార్తీక్‌పై ప్రశంసలు కురిపించాడు రోహన్‌. (చదవండి: వాటే మ్యాచ్‌.. కేకేఆర్‌ విన్నర్‌)

ఈరోజు(శనివారం)కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన  మ్యాచ్‌లో కేకేఆర్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్‌ తన 164 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. కింగ్స్‌ పంజాబ్‌ కడవరకూ పోరాడినా 162 పరుగులకే పరిమితం కావడంతో ఆజట్టుకు మరో ఓటమి ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ల్‌కతా నైట్‌రైడర్స్‌ 164 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌(57; 47 బంతుల్లో 5 ఫోర్లు),  దినేశ్‌ కార్తీక్‌(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దానికి కింగ్స్‌ పంజాబ్‌ ధీటుగా బదులిచ్చినా చివర్లో తేలిపోయింది. పంజాబ్‌ ఓపెనర్లు  కేఎల్‌ రాహుల్‌(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. ఓపెనర్లు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఓటమి పాలుకావడం ఆ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది.ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి.

మరిన్ని వార్తలు