ఆ పంచ్‌ నా భర్తపై ప్రయోగిస్తా: దీపికా పల్లికల్‌

5 Mar, 2021 12:36 IST|Sakshi

ముంబై: ''మీరు చెప్పే హుక్‌ పంచ్‌ను నా భర్త దినేశ్‌ కార్తిక్పై ప్రయోగిస్తానంటూ'' ఇండియన్‌ స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పల్లికల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అడిగిన ప్రశ్నకు దీపిక ఈ విధంగా సమాధానమిచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ అడ్వర్టైజింగ్‌ సంస్థ అడిడాస్‌ నిర్వహించిన ఒక ఈవెంట్‌కు దీపికా పల్లికల్‌తో పాటు 2017 మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌, ఇండియన్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లు హాజరయ్యారు. అడిడాస్‌ నిర్వహించిన వాచ్‌ అస్‌ మూవ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమంలో పాల్గొన్న వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది.

బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తన ఫేవరెట్‌ షాట్‌ అయిన హుక్‌ పంచ్‌ను ప్రస్తావించిది. తాను ఆ పంచ్‌ను ఎలా ఉపయోగిస్తాననేది దీపికా, మానుషి చిల్లర్‌కు వివరించింది. ఈ నేపథ్యంలో ''దీపికా.. మీరు హుక్‌ పంచ్‌ను ఎవరిపై ప్రయోగిస్తారు'' అని నిఖత్‌ జరీన్‌ ప్రశ్నించింది. నిఖత్‌ ప్రశ్నకు దీపిక వెంటనే స్పందిస్తూ '' వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు.. అందుకే నేను ఈరోజే నా భర్త కార్తిక్‌పై ప్రయోగిస్తా..'' అంటూ చెప్పడం అక్కడున్న వారందరికి నవ్వు తెప్పించింది. ఇంటికి వెళ్లగానే  కార్తిక్‌కు హుక్‌ పంచ్‌ గురించి వివరించి దానిని అమలు పరిచేలా చూస్తానని దీపికా తెలిపింది.

ఇండియన్‌ స్క్వాష్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన దీపికా పల్లికల్‌ 2013లో క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ను పెళ్లాడింది. ఇప్పటివరకు ఎన్నో మెడల్స్‌ సాధించిన ఆమె మూడు మెడల్స్‌ను కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో.. మరో నాలుగు పతకాలు ఏషియన్‌ గేమ్స్‌లో గెలుచుకుంది. ఇక టీమిండియా జట్టుకు చాలాకాలంగా దూరమైన దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. గతేడాది కేకేఆర్‌కు కెప్టెన్‌గ వ్యవహరించిన కార్తిక్‌ లీగ్‌ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో  కేకేఆర్‌ యాజమాన్యం ఇంగ్లండ్‌ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. 2019లో చివరిసారిగా వన్డే ఆడిన కార్తిక్‌ టీమిండియా తరపున 94 వన్డేల్లో 1752 పరుగులు, 32 టీ20ల్లో 399 పరుగులు, 26 టెస్టుల్లో 1025 పరుగులు సాధించాడు.
చదవండి: 
శుభ్‌మన్‌ గిల్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ వార్నింగ్‌!
రూల్స్‌ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా

మరిన్ని వార్తలు