జొకోవిచ్‌కు ఊహించని షాక్‌.. విమానాశ్రయంలోనే నిలిపివేత

6 Jan, 2022 04:40 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకునేందుకు ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఇక్కడికి వచ్చిన డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు ఊహించని షాక్‌ ఎదురైంది. ఒక్క డోసు తీసుకోకపోయినా... ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా టోర్నీ నిర్వాహకులు అనుమతించారు.

అయితే మినహాయింపు కోసం అతను జతచేసిన ధ్రువపత్రాల్లో సహేతుక కారణాలు ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వీసా కోసం ఇవన్నీ స్క్రూటినీ చేశాకే వీసా మంజూరు చేస్తారు. ఇప్పుడు వీసా పొరపాటు కారణంగానే అతన్ని మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ అంశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ కూడా స్పందించారు. టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలుంటేనే వీసాగానీ, ఆడనిచ్చేదిగానీ జరుగుతుందని లేదంటే ఎంతవారైనా తిరుగు పయనం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తం మీద జొకో టైటిల్‌ వేటలో ఉండేది లేనిది నేడు తేలే అవకాశముంది. 

మరిన్ని వార్తలు