దోహాలో 2030 ఆసియా క్రీడలు

17 Dec, 2020 02:50 IST|Sakshi

మస్కట్‌ (ఒమన్‌): ఆసియా క్రీడలను రెండోసారి నిర్వహించే అవకాశాన్ని ఖతర్‌ రాజధాని దోహా దక్కించుకుంది. 2030 ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) సమావేశంలో ఓటింగ్‌ ద్వారా 2030, 2034 ఆసియా క్రీడల ఆతిథ్య నగరాలను ఎంపిక చేశారు. 2030 ఆసియా క్రీడల నిర్వహణ కోసం దోహా... సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ పోటీపడ్డాయి. ఓటింగ్‌లో రియాద్‌ను వెనక్కినెట్టి దోహా ఆతిథ్య హక్కులను సంపాదించింది. రియాద్‌కు 2034 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కులు కట్టబెట్టామని ఓసీఏ అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌ అల్‌ ఫహాద్‌ అల్‌ సబా (కువైట్‌) ప్రకటించారు. గతంలో 2006లో దోహా తొలిసారి ఆసియా క్రీడలను నిర్వహించింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో... 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి–నగోయా నగరాల్లో జరుగుతాయి.

మరిన్ని వార్తలు