యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న థీమ్‌

19 Aug, 2021 07:29 IST|Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్‌ నంబర్‌ 6 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

క్వార్టర్‌ ఫైనల్లో ఆకుల శ్రీజ 
బుడాపెస్ట్‌ (హంగేరీ)లో జరుగుతున్న వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ 150వ ర్యాంకర్‌  శ్రీజ 11–9, 11–6, 13–11తో ప్రపంచ 53వ ర్యాంకర్‌ బార్బొరా బలజోవా (స్లొవాక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన వరల్డ్‌ 60వ ర్యాంకర్‌ మనికా బాత్రాతో తలపడుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు