ఇదెక్కడి డీఆర్‌ఎస్‌ రూల్‌?

2 Oct, 2020 16:40 IST|Sakshi

అబుదాబి: కింగ్స్‌ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. ముంబై బ్యాటింగ్‌కు తొలుత పూర్తిగా చేతులెత్తేసిన కింగ్స్‌ పంజాబ్‌.. ఆ తర్వాత బౌలింగ్‌ పంచ్‌ ముందు తేలిపోయింది. దాంతో ముంబై 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే అంపైర్ల​ నిర్ణయ సమీక్ష(డీఆర్‌ఎస్‌) నిబంధనల్లో ఒక సవరణ అనివార్యమనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.  వచ్చే ఏడాడి  టీ20 ప్రపంచకప్ జరుగుతుందని, అప్పటి వరకైనా ఈ నిబంధనలోని లోపాలను సవరించాలని విశ్లేషకులు కోరుతున్నారు.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతి కీరన్ పొలార్డ్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. (చదవండి: మరో హిస్టరీ ముంగిట ధోని)

ఇది బ్యాట్‌కు తగిలిందనే భావనలో పొలార్డ్‌ రివ్యూకు వెళ్లాడు. ఇది సక్సెస్‌ అయ్యింది. బ్యాట్‌ను బంతి తాకుతూ వెళ్లినట్లు రిప్లేలో కనబడింది. దాంతో పొలార్డ్‌ బతికిపోయాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ ఎల్బీగా ప్రకటించే క్రమంలో పొలార్డ్‌ సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ పరుగు కౌంట్‌ కాలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్‌ ఔటిచ్చిన తర్వాత ఆ బాల్‌ డెడ్‌ అయినట్లే. దాంతో సింగిల్‌ను కౌంట్‌ చేయలేదు. కానీ పొలార్డ్‌ రివ్యూ సక్సెస్‌ అయ్యింది. అయినా ఆ సింగిల్‌ను స్కోరులో కలపరు. ఇది నిన్న మనకు క్లియర్‌గా తెలిసింది. దీన్ని మార్చాలని కోరుతున్నాడు కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా. అంపైర్ల తప్పిదానికి పరుగులు ఎందుకు తగ్గించాలని ప్రశ్నిస్తున్నాడు. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది సరైన రూల్‌ కాదన్నాడు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఐసీసీ లా మేకర్‌ అయిన ఎంసీసీ(మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌)కు విన్నవించాడు.

మరిన్ని వార్తలు