డిఫెన్స్‌ చెక్‌ చేయబోయి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు..

13 Oct, 2020 20:01 IST|Sakshi
డుప్లెసిస్‌ వికెట్‌ తీసిన సందీప్‌(ఫొటో కర్టీసీ: ట్విట్టర్‌)

దుబాయ్‌:  సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌-సామ్‌ కరాన్‌లు ఆరంభించారు. షేన్‌ వాట్సన్‌కు బదులు సామ్‌ కరాన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. కేవలం బంతి మాత్రమే ఆడి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.  బంతిని అంచనా వేయడంలో కాస్త తడబడ్డ డుప్లెసిస్‌ డిఫెన్స్‌ ఆడబోయి వికెట్‌ కీపర్‌ బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన ఆ షార్ట్‌ లెంగ్త్‌ డెలివరీ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ పడి అదనపు బౌన్స్‌తో కొద్దిగా స్వింగ్‌ అయ్యింది. (కోహ్లి.. ఇది ఓవరాక్షన్‌ కాదా?)

దాంతో బ్యాట్‌ను పెట్టాలా.. వద్దా అనే తడబాటులో వికెట్‌ను సమర్పించుకున్నాడు డుప్లెసిస్‌. అక్కడ డుప్లెసిస్‌ను ‘డబుల్‌ మైండ్‌’కు గురిచేసిన సందీప్‌ శర్మ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 10 పరుగుల వద్ద సీఎస్‌కే వికెట్‌ను కోల్పోయింది. డుప్లెసిస్‌ ఔటైన తర్వాత వాట్సన్‌ ఫస్ట్‌ డౌన్‌ వచ్చాడు.ఈ సీజన్‌లో ఇరు జట్లను నిలకడలేమి కలవరపరుస్తోంది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే, మరొక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇరుజట్లకు సాధారణంగా మారిపోయింది. ఇందులో సీఎస్‌కే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఒకదాంట్లో మాత్రమే గెలవగా, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, రెండు మ్యాచ్‌లో ఓడిపోయింది.  దాంతో ఇరు జట్లకు విజయం అనేది చాలా ముఖ్యం. 
 

>
మరిన్ని వార్తలు