Uae T20 League: జట్టును ప్రకటించిన దుబాయ్ క్యాపిటల్స్.. శ్రీలంక కెప్టెన్‌తో పాటు!

18 Aug, 2022 21:50 IST|Sakshi

యూఏఈ టీ20 లీగ్ లో దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం జీఎంఆర్‌ గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్‌ కోసం దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టును గురువారం ప్రకటించింది.

విండీస్‌ పవర్ హిట్టర్ రోవ్‌మాన్ పావెల్, శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షనక వంటి ఆటగాళ్లతో దుబాయ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కూడా రోవ్‌మాన్ పావెల్ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్‌ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం.

దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్‌మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ
చదవండి
IND vs ZIM: వన్డేల్లో ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్‌, గంగూలీ వంటి దిగ్గజాల సరసన!

మరిన్ని వార్తలు