కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్‌ గోల్‌ కీపర్‌.. నోరూరించే వంటకాలు రెడీ

4 Jul, 2023 11:35 IST|Sakshi

అర్జెంటీనా స్టార్‌ గోల్‌ కీపర్‌, ఫిపా ప్రపంచకప్‌-2022 హీరో ఎమిలియానో మార్టినెజ్ కోల్‌కతా పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కోల్‌కతాకు వచ్చిన మార్టినెజ్.. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. జూలై 4న కోల్‌కతాలోని మోహన్ బగాన్ సూపర్‌జెయింట్స్ స్టేడియంను మార్టినెజ్ సందర్శించనున్నారు.

అదే విధంగా ప్రస్తుత ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్స్‌ మోహన్ బగాన్ సూపర్‌జెయింట్స్ జట్టును కూడా మార్టినెజ్ కలవనున్నాడు. అంతేకాకుండా క్రికెట్‌, ఫుట్‌బాల్‌ రంగాలకు చెందిన పలువురుతో మార్టినెజ్ ఇంట్రాక్ట్‌ కానున్నాడు. జాలై 5తో ఎమిలియానో టూర్‌ ముగియనుంది.

ఇక అతడి కోసం నూరూరించే బెంగాలీ వంటకాలను బెంగాల్‌ స్పోర్ట్స్ ప్రమోటర్ సతద్రు దత్తా సిద్దం చేశారు. మార్టినెజ్ కోసం  మెనూ ఎంపిక చేసే బాధ్యతను ప్రముఖ బెంగాలీ రెస్టారెంట్ సప్తపదికి అప్పగించారు. అందులో బెంగాళీ ప్రసిద్ద వంటకాలు కీమా మటర్ టార్ట్, ఇలిష్ పాటూరి,కంచ లోంక ముర్గి వంటివి ఉన్నాయి.
చదవండి: స్టార్‌ ప్లేయర్‌ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు

మరిన్ని వార్తలు