ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు

3 Sep, 2021 21:40 IST|Sakshi

లండన్‌: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌ 81 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. శార్ధూల్‌ ఠాకూర్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికే పోప్‌ ఔటయ్యాడు. శార్దూల్‌ వేసిన బంతిని పోప్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి ఇన్నర్‌ ఎడ్జ్‌తో వికెట్లను గిరాటేసింది. దీంతో కోపం పట్టలేక బాధతో తన బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా వెనుదిరిగాడు.

ఇక పోప్‌ కీలక సమయంలో రాణించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పోప్‌ బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బెయిర్‌ స్టో, మొయిన్‌ అలీలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. క్రిస్‌ వోక్స్‌ 28, జేమ్స్‌ అండర్సన్‌ 1 పరుగుతో క్రీజులో ఉ‍న్నారు.

మరిన్ని వార్తలు