ENG Vs IND: స్పిన్‌ బౌలింగ్‌.. అందరూ హెల్మెట్లతోనే, కారణం అదే

28 Aug, 2021 10:23 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు సంబంధించి అభిమానులు సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికర అంశాన్ని చర్చించారు. స్పిన్‌ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ హెల్మెట్‌ తీసేసి క్యాప్స్‌ ధరించడం గమనిస్తుంటాం. అయితే తాజాగా జరుగుతున్న మూడో టెస్టులో స్పిన్‌ బౌలింగ్‌ సమయంలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా క్యాప్‌ ధరించలేదు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పిన్నర్లు వేసిన పది ఓవర్లు క్యాప్‌ ధరించే ఆడాడు.

చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్‌ కట్టుకొని కోహ్లి స్థానంలో

అయితే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ క్యాప్స్‌ ధరించకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఫాస్ట్‌, స్పిన్‌ ఇలా ఏ బౌలింగ్‌  అయినా సరే.. కచ్చితంగా హెల్మెట్‌ పెట్టుకొని ఆడాల్సిందే అంటూ సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) సర్కులర్‌ను జారీ చేసింది. హెడ్‌ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ కింద ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాట్స్‌మెన్‌ తలకు గాయం కాకుండా ఉండేందుకు ఇలాంటి రెగ్యులేషన్‌ను అమలు చేస్తుంది.  

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడోటెస్టులో టీమిండియా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మొదటి రెండు రోజులు ఆటలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఇంగ్లండ్‌ మూడోరోజు మాత్రం బేజారిపోయింది. భారత టాపార్డర్‌ బాట్స్‌మెన్‌ రాణింపుతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ పస తగ్గింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ పొరపాటు చేయలేదు. రోహిత్‌ శర్మ, పుజారా, కోహ్లిల రాణింపుతో టీమిండియా నిలదొక్కుకుంది. ప్రస్తుతం మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

చదవండి: ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత

మరిన్ని వార్తలు