ఇదీ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల పరిస్థితి.. అంతేగా.. అంతేగా!

7 Sep, 2021 11:59 IST|Sakshi

టీమిండియా విజయం పై ప్రముఖుల ప్రశంసల వెల్లువ

లండన్‌: ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో  ఇంగ్లండ్‌ పై ఘనవిజయం సాధించిన టీమిండియా పై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు, కోహ్లి సేనను అభినందిస్తున్నారు. అభిమానులు చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వెంకటేశ్‌ ప్రసాద్‌.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లును కొనియాడతూ ట్వీట్‌ చేశారు.  

మరో భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ .. భారత్‌కు ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశాడు.

భయం లేదు.. బెరుకు లేదు.. కలిసికట్టుగా ఏదైనా సాధిస్తుంది.. అదే టీమిండియా అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్వీట్‌ చేశాడు.

ఇక ఎల్లప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ మరోసారి తనదైన శైలిలో ట్వీటాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల పరిస్థితి ఇదీ అన్నట్లుగా.. ఓ మీమ్‌ను పంచుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు