Eng Vs NZ: అదరగొట్టిన సౌథీ, బౌల్ట్‌.. ఇంగ్లండ్‌కు షాక్‌! కానీ పాట్స్‌ ఉన్నాడుగా!

3 Jun, 2022 17:30 IST|Sakshi
కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ, ఇంగ్లండ్‌ బౌలర్‌ మాథ్యూ పాట్స్‌(PC: Black Caps/ECB)

New Zealand tour of England 2022- Eng Vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా తొలిరోజు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్‌ 141 పరుగులకే ఆలౌట్‌ అయింది. మొదటి రోజు ఆటలో 92/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆతిథ్య జట్టును కివీస్‌ బౌలర్లు దెబ్బకొట్టారు. ట్రెంట్‌ బౌల్ట్‌, కైలీ జెమీషన్‌, టిమ్‌ సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. వీరి దెబ్బకు 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది.

ఇక శుక్రవారం నాటి రెండోరోజు ఆటలో భాగంగా సౌథీ.. స్టువర్డ్‌ బ్రాడ్‌ను అవుట్‌ చేయడంతో ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఫోక్స్‌ రూపంలో తొమ్మిదో వికెట్‌ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో పార్కిన్సన్‌ వికెట్‌ తీసి బౌల్ట్‌ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్‌.. కివీస్‌ కంటే కేవలం 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా సౌథీ నాలుగు, బౌల్డ్‌ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జెమీషన్‌కు రెండు, గ్రాండ్‌హోమ్‌కు ఒక వికెట్‌ లభించాయి. 

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. టామ్‌ లాథమ్‌ 14, విల్‌ యంగ్‌ 1, కేన్‌ విలియమ్సన్‌ 15 పరుగులకే పెవిలియన్‌ చేరారు. ఆండర్సన్‌ ఒకటి, అరంగేట్ర బౌలర్‌ మాథ్యూ పాట్స్‌ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆటలో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ స్కోరు: 36-3. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కొనసాగుతోంది.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌: తొలి టెస్టు
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 132-10 (40 ఓవర్లు)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 141-10 (42.5 ఓవర్లు)

చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్‌.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్‌ కెప్టెన్‌
Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!

మరిన్ని వార్తలు