Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్‌.. స్పిన్నర్‌ తలకు గాయం.. ఆట మధ్యలోనే..

2 Jun, 2022 18:57 IST|Sakshi
ఆట మధ్యలోనే మైదానం వీడిన జాక్‌ లీచ్‌(PC: ECB Twitter)

England Vs New Zealand 1st Test 2022 Day 1: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయపడ్డాడు. తలకు గాయం కావడంతో మొదటి టెస్టు నుంచి వైదొలిగాడు. మ్యాచ్‌ ఆరంభమైన తొలిరోజే జట్టును వీడాడు. అతడి స్థానంలో మ్యాట్‌ పార్కిన్సన్‌ జట్టులోకి వచ్చాడు. కాగా  ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కివీస్‌ లార్డ్స్‌ వేదికగా ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో కివీస్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో జాక్‌ లీచ్‌ తలకు గాయమైంది. ఈ నేపథ్యంలో.. ‘‘ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో జాక్‌ లీచ్‌ గాయపడ్డాడు. కన్‌కషన్‌(తలకు దెబ్బ తగిలిన కారణంగా అపస్మార స్థితికి వెళ్లే అవకాశం)లక్షణాలు కనిపించాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం అతడు మొదటి టెస్టు నుంచి వైదొలిగాడు’’ అని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానాన్ని పార్కిన్సన్‌తో భర్తీ చేసింది. దీంతో కన్‌కషన్‌ సబ్‌ట్యూట్‌గా అతడు ఎంట్రీ ఇచ్చాడు. ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు కేవలం ఫీల్డింగ్‌ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది.  కాగా కివీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా మాథ్యూ పాట్స్‌ అనే కొత్త కుర్రాడు ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేశాడు.

చదవండి 👇
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!
Shakib Al Hasan: మరోసారి బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌గా షకీబ్‌ అల్‌ హసన్‌!

మరిన్ని వార్తలు