Tim Bresnan Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్‌ ఆల్ రౌండర్

31 Jan, 2022 18:03 IST|Sakshi

Tim Bresnan Announces Retirement: ఇంగ్లండ్‌కు తొలి టీ20 ప్రపంచకప్(2010) అందించిన జట్టులో కీలక సభ్యుడు, ఆ దేశ స్టార్‌ ఆల్‌రౌండర్‌ టిమ్‌ బ్రేస్నన్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్‌షైర్‌ కౌంటీ సోమవారం కన్ఫర్మ్‌ చేసింది. 


ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36 ఏళ్ల బ్రేస్నన్‌.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో 4 అర్ధ సెంచరీలు, 2 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. జాతీయ జట్టుతో పోలిస్తే కౌంటీ జట్టు వార్విక్‌షైర్‌తో ఎక్కువ అనుబంధం కలిగిన అతను.. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 213 మ్యాచ్‌ల్లో 575 వికెట్లు, 7128 పరుగులు చేశాడు. బ్రేస్నన్‌ ఇంగ్లండ్‌ యాషెస్‌ గెలిచిన రెండు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించాడు. 


చదవండి: Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!

మరిన్ని వార్తలు