ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా

9 Dec, 2022 18:28 IST|Sakshi

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. తద్వారా టెస్టు మ్యాచ్‌ తొలి రోజు మొదటి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డులకెక్కింది.

అంతకుమందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా 179 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఇంగ్లండ్‌ 120 ఏళ్ల దక్షిణాఫ్రికా రికార్డు బ్రేక్‌ చేసింది.

ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్‌ అహ్మద్‌
ఇక ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాక్‌ అరంగేట్ర స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ అదరగొట్టాడు. డెబ్యూ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక అహ్మద్‌ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది.

అహ్మద్‌తో పాటు జహీద్‌ మహ్మద్‌ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డాకెట్‌ (63), ఓలీ పాప్‌(60) పరుగులతో రాణించారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!

>
మరిన్ని వార్తలు