CWG 2022: భారత్‌తో సెమీఫైనల్‌.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌! కెప్టెన్‌ దూరం!

5 Aug, 2022 18:22 IST|Sakshi

భారత మహిళలతో సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌  హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022 నుంచి వైదొలిగింది. అదే విధంగా త్వరలో జరగనున్న ది హండ్రెడ్ లీగ్‌కు కూడా ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్, ది హండ్రెడ్‌ లీగ్‌కు దూరం కానుంది.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడ్డ నైట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అదే విధంగా మిగితా మ్యాచ్‌లకు కూడా నాట్ స్కివర్ కెప్టెన్‌గా కొనసాగనుంది" అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు  ట్విటర్‌లో పేర్కొంది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌కు ప్రకటించిన ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా నైట్‌ ఎంపికైనప్పటికీ.. ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైంది. ఇక భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం(ఆగస్టు 6) జరగనుంది.

తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్‌ మహిళల జట్టు డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్‌), అమీ జోన్స్ (వికెట్‌ కీపర్‌), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్

భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్

England Women’s captain Heather Knight has been ruled out of the Commonwealth Games and The Hundred.

The hip injury she sustained in the first Vitality IT20 against South Africa has failed to settle down as expected and Knight will continue to receive treatment. pic.twitter.com/iTJA17nXkU

చదవండి: Chris Gayle: క్రిస్‌ గేల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు!

మరిన్ని వార్తలు