ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ 

27 Jun, 2021 09:59 IST|Sakshi

సౌతాంప్టన్‌: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్‌ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. డేవిడ్‌ మలాన్‌ (48 బంతుల్లో 76; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేశారు. 

దీంతో తర్వాత బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఆతిథ్య జట్టు భారీస్కోరు చేసింది. చమీరాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక 18.5 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. బినుర ఫెర్నాండో (20), ఒషాడో ఫెర్నాండో (19), డిక్‌వెలా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లు విల్లే 3, స్యామ్‌ కరన్‌ 2 వికెట్లు తీశారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు