-

కౌంటీల్లో ఆడనున్న స్మిత్‌! ద్రోహులు అంటూ ఆగ్రహం! ఇందులో తప్పేముంది?

20 Jan, 2023 13:06 IST|Sakshi

Steve Smith- Sussex Deal: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలిసారి ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ససెక్స్‌ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లలో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్‌ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ససెక్స్‌ క్రికెట్‌ హెడ్‌ పాల్‌ ఫాబ్రేస్‌తో మాట్లాడానని, కౌంటీల్లో ఆడనుండటం నిజమేనని ధ్రువీకరించాడు.

అందుకే ఈ నిర్ణయం
తనకు ఇదో సరికొత్త అనుభవమన్న స్మిత్‌.. యువ క్రికెటర్లతో కలిసి బ్యాటింగ్‌ చేయడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యంగ్‌ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూం షేర్‌ చేసుకోవడం ద్వారా వాళ్లను మెంటార్‌ చేసే అవకాశం కూడా వస్తుందని, ఇది తనకు సంతృప్తినిస్తుందని స్మిత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 

మండిపడుతున్న అభిమానులు
కాగా ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సన్నాహకాల్లో భాగంగా స్మిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్మిత్‌ కౌంటీల్లో ఆడటంపై ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అతడికి ఈ అవకాశం ఇచ్చిన ససెక్స్‌ జట్టును ద్రోహులుగా అభివర్ణిస్తూ నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు. యాషెస్‌ సిరీస్‌​కు ముందు ఆసీస్‌ ఆటగాళ్లను ఇంగ్లండ్‌ పిచ్‌లపై ఆడించడం ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు.

తప్పేముందన్న మాజీ సారథి
అయితే, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రముఖ కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ భిన్నంగా స్పందించాడు. స్మిత్‌ కౌంటీల్లో ఆడటాన్ని అతడు స్వాగతించాడు. స్మిత్‌ వంటి మేటి టెస్టు క్రికెటర్లు ససెక్స్‌ డ్రెస్సింగ్‌రూంలో ఉండటం.. యువ ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతుందని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌.. మైకేల్‌ వ్యాఖ్యలతో ఏకీభవించినప్పటికీ.. యాషెస్‌ సిరీస్‌(డిసెంబరులో)కు ముందు ఇలాంటి నిర్ణయం సరికాదని పెదవి విరిచాడు. 

చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్‌ ఫైర్‌
Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌.. హ్యాట్రిక్‌ విజయాలు.. ఫ్యాన్స్‌ ఖుషీ! ఈసారి..

మరిన్ని వార్తలు