Anya Shrubsole Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌

16 Apr, 2022 08:15 IST|Sakshi

ఇంగ్లండ్‌ మహిళా స్టార్‌ బౌలర్‌ అన్య ష్రుబ్సోల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ష్రూబ్‌సోల్ 2009,2017లో ప్రపంచకప్‌లు గెలిచిన ఇంగ్లండ్‌లో జట్టులో భాగమైంది. 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌పై  ఆరు వికెట్లు పడగొట్టి  ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్‌ తరపున అన్ని ఫార్మాట్లలో 173 మ్యాచ్‌లు ఆడిన అన్య ష్రుబ్సోల్.. 227 వికెట్లు పడగొట్టింది.

ఇక టీ20ల్లో 102 వికెట్లు పడగొట్టిన ఆమె.. టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇంగ్లండ్‌ బౌలర్‌గా రికార్డును కలిగి ఉంది. ష్రూబ్‌సోల్ చివరగా మహిళల ప్రపంచ కప్-2022 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మంట్‌ ప్రకటించిన ఆమె రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ, షార్లెట్ ఎడ్వర్డ్స్ కప్, ది హండ్రెడ్‌ వంటి దేశవాళీ టోర్నీలో మాత్రం ఆడనుంది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా!

మరిన్ని వార్తలు