ఇంగ్లండ్‌ ఘనవిజయం

28 Aug, 2022 06:10 IST|Sakshi

మాంచెస్టర్‌: పేస్‌ బౌలర్లు ఓలీ రాబిన్సన్‌ (4/43), అండర్సన్‌ (3/30),  స్టోక్స్‌ (2/30),  బ్రాడ్‌ (1/24) అదరగొట్టడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 85 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది.

ఆట మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 23/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 85.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పీటర్సన్‌ (42; 1 ఫోర్‌), డసెన్‌ (41; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన స్టోక్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1–1తో సమం చేసింది.

మరిన్ని వార్తలు