Ashes 2021-22: బెయిర్‌స్టో వచ్చేశాడు.. ఇంగ్లండ్‌ ఈ సారైనా గెలిచేనా!

25 Dec, 2021 09:57 IST|Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌(బాక్సింగ్‌డే టెస్ట్‌)  డిసెంబరు 26న ప్రారంభం కానుంది. కాగా బాక్సింగ్‌డే టెస్ట్ ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మార్పులతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్ స్ధానంలో జాక్‌ క్రాలీకి చోటు దక్కింది. ఈ సిరీస్‌లో రెండు టెస్ట్‌లు ఆడిన బర్న్స్ కేవలం 51 పరుగులు మాత్రమే సాధించాడు. ఆదే  విధంగా హసీబ్ హమీద్‌కి మరో అవకాశం ఇచ్చారు. ఓలీ పోప్‌ స్ధానంలో సీనియర్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో జట్టులోకి వచ్చాడు.

ఆదే విధంగా క్రిస్‌ వోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ కూడా దూరమయ్యారు. వీరి స్ధానంలో మార్క్‌ వుడ్‌, జాక్‌ లీచ్‌ జట్టులోకి వచ్చారు. కాగా ప్రతిష్టాత్మక   యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. కాగా బాక్సింగ్‌ డే టెస్ట్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలి అని భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఇదే జోరు కొనసాగించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌లో 2-0తో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది.

ఇంగ్లండ్‌ జట్టు: హసీబ్ హమీద్, జాక్ క్రాలీ, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్‌), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.

చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్‌.. హనుమ విహారికు నో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు