ఇంగ్లండ్‌ తుది జట్టు కూర్పుపై మండిపడ్డ బాయ్‌కాట్‌

12 Feb, 2021 17:07 IST|Sakshi

లండన్‌: భారత్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్నరెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తుది జట్టులో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్‌ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎడ్‌ స్మిత్‌కు ఇష్టం లేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జెఫ్రీ బాయకాట్‌ ఆరోపించాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో బెయిర్‌స్టో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. విశ్రాంతి పేరుతో అతన్ని ఇంటికి పంపించి, ఇప్పుడు తుది జట్టులో ఆడే అవకాశం ఉన్నా అతనికి బదులు మరో వికెట్‌ కీపర్‌(బెన్‌ ఫోక్స్‌)వైపు మొగ్గు చూపడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ప్రతిభ గల ఆటగాడి పట్ల జట్టు యాజమాన్యం ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 

కాగా, భారత్‌తో రెండో టెస్ట్‌కు జోస్‌ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో బెన్‌ ఫోక్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌ జట్టులో ఇటీవల కాలంలో రోటేషన్‌ పద్దతి పేరుతో ఆటగాళ్లను అకారణంగా పక్కకు పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. అండర్సన్‌, ఆర్చర్‌, బట్లర్‌, బెస్‌ల స్థానంలో వోక్స్‌, బ్రాడ్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీలతో బరిలోకి దిగుతుంది. భారత్‌ నదీమ్‌కు బదులు అక్షర్‌ పటేల్‌కు అవకాశం కల్పించింది. మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు