ఇంగ్లండ్‌దే సిరీస్‌ 

27 Sep, 2020 03:22 IST|Sakshi

మూడో టి20లోనూ విండీస్‌ మహిళల జట్టు పరాజయం  

డెర్బీ: ఆరు నెలల తర్వాత పునః ప్రారంభమైన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు గెలుచుకుంది. వెస్టిండీస్‌ జట్టుతో జరుగుతోన్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 3–0తో కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 20 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నటాలీ స్కీవర్‌ (61 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగింది. హీథెర్‌నైట్‌ (29; 3 ఫోర్లు) రాణించింది. అనంతరం వెస్టిండీస్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులే చేసి ఓడిపోయింది. డాటిన్‌ (56 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. హీలీ మాథ్యూస్‌ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు), స్టెఫానీ టేలర్‌ (13 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు), షినెల్లీ హెన్రీ (12 బంతుల్లో 12 నాటౌట్‌; 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. కేథరిన్‌ బ్రంట్, సారా గ్లెన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు