చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(29), స్మృతి మంధాన(23) పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్ల అంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో గ్లెన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. డేవిస్, స్మిత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ సోఫియా డంక్లీ 61 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మాత్రమే వికెట్ సాధించింది.
చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం