38 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ చెత్త రికార్డు

25 Feb, 2021 19:12 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ 38 ఏళ్ల తర్వాత మరోసారి చెత్త రికార్డును నమోదు చేసింది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 81 పరుగులకే ఆలౌట్‌ కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు చాప చుట్టేసిన సంగతి తెలిసింది. ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఓవరాల్‌గా 193 పరుగులు చేసింది.  

1983-84లో క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్‌ అయిన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే కుప్పకూలింది. అప్పట్లో ఆ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 175 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌట్‌ కావడంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

తాజాగా టీమిండియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మరోసారి తక్కువ స్కోరు నమోదు చేయడం ద్వారా 38 ఏళ్ల  చెత్త రికార్డును ఇంగ్లండ్‌ సవరించింది అయితే అప్పటి మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడగా.. తాజాగా మాత్రం రెండో ఇన్నింగ్స్‌ ఆడడం ఒక్కటే తేడా అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇండియాపై టెస్టుల్లో ఒక  ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది ఐదోసారి కాగా.. 81 పరుగుల అత్యల్ప స్కోరు తొలి స్థానంలో నిలిచింది. 
చదవండి: ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు: మాజీ క్రికెటర్‌
ఆర్చర్‌ ఔట్‌, రికార్డు సృష్టించిన అశ్విన్‌

మరిన్ని వార్తలు