#ChristianEriksen: అదృష్టం కొద్దీ బతికాడు.. బ్యాడ్‌లక్‌ బ్యాన్‌!

14 Jun, 2021 08:34 IST|Sakshi

యూరో ఛాంపియన్‌షిప్‌ 2021 టోర్నీ మ్యాచ్‌లో ఫుట్‌బాల్‌ మైదానంలోనే కుప్పకూలిన డెన్మార్క్‌ ఆటగాడు క్రిస్టియన్‌ ఎరిక్‌సెన్‌ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైదానం నుంచి అతని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ‘ఔట్‌ ఆఫ్‌ డేంజర్‌’ అని డాక్టర్లు చెప్పేదాకా.. అసలు అతనికి ఏం జరిగిందన్న విషయం చెప్పకుండా ఆసక్తిని రేకెత్తించారు. అయితే చివరికి 29 ఏళ్ల ఈ డెన్మార్క్‌ ఆటగాడికి గుండెపోటు వచ్చిందని డాక్టర్లు ధృవీకరించారు.

‘‘అతనికి గుండెపోటు వచ్చింది. అవును.. బతకడం అతని అదృష్టం అని టీం డాక్టర్‌ మోర్టెన్‌ బోయిసెన్‌ మీడియాకు వెల్లడించాడు. ఎరిక్‌సెన్‌ కుప్పకూలిపోయినాక.. దగ్గరికి వెళ్లి చూశాం. అతనికి గుండెపోటు వచ్చిందని అప్పుడే అర్థమైంది. చనిపోయాడనుకున్నాం. కానీ, అదృష్టం బతికాడు.. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం. ఇంతకంటే విషయాలేమీ ఇప్పుడు వివరించలేను’’ అని మోర్టెన్‌ హడావిడిగా వెళ్లిపోయాడు.    

వేటు తప్పదా?
తని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఆడతానని ముందుకొచ్చినా.. తీసుకునే ప్రసక్తే లేదని ఇటలీ ప్రకటించింది. క్రిస్టియన్‌ డెన్మార్క్‌ జాతీయ జట్టులోనే కాకుండా.. ఇంటర్‌ మిలన్‌(సిరీ ఎ క్లబ్‌) తరపున ఆడుతున్నాడు కూడా. ఈ క్రమంలో అక్కడి చట్టాల ప్రకారం అతనిపై నిషేధం విధించే అవకాశం ఉందని క్లబ్‌ మెంబర్‌ ఒకరు తెలిపారు. ఇక డెన్మార్క్‌ జట్టు కూడా అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తిరిగి జట్టులోకి చేర్చుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక  క్రిస్టియన్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రసక్తే ఉండబోదని అతని ప్రేయసి/భార్య విస్ట్‌ జెన్సన్‌ నిన్న మీడియా ముందు భావోద్వేగంగా వెల్లడించింది. కాగా, ఎరిక్‌సెన్‌ 2010 మార్చ్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడగా.. 2010 ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడిన యంగెస్ట్‌ ప్లేయర్‌ ఘనత దక్కించుకున్నాడు. ఐదేళ్లపాటు డెన్మార్క్‌ ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ దక్కించుకున్నాడు కూడా.  చదవండి: కుప్పకూలిన ఫుట్‌బాల్‌ ప్లేయర్

మరిన్ని వార్తలు