ఇంగ్లండ్‌ కల నెరవేరేనా?

11 Jul, 2021 04:45 IST|Sakshi

యూరో కప్‌ ఫైనల్లో ఇటలీతో అమీతుమీ

నెల రోజులుగా ఫుట్‌బాల్‌ ప్రియులను అలరిస్తున్న యూరో కప్‌ టోర్నమెంట్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక గం. 12:30 నుంచి జరిగే టైటిల్‌ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారి యూరోలో ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌ కప్‌ కొట్టేయాలనే కసి మీద ఉండగా... ఇప్పటికే ఒకసారి (1968లో) చాంపియన్‌గా నిలిచిన ఇటలీ రెండోసారి ఆ ఘనత వహించేందుకు ఉత్సాహంగా ఉంది. రెండు జట్లు కూడా గ్రూప్‌ స్టేజ్‌ నుంచే ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇంగ్లండ్‌ కెప్టెన్, ఫార్వర్డ్‌ హ్యారీ కేన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... గత 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇటలీ ఓటమి లేకుండా దూసుకెళుతోంది. ఫైనల్‌ సోనీ సిక్స్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. 

మరిన్ని వార్తలు