ఐపీఎల్‌ వేలం రేపే.. ఎవరి దగ్గర ఎంత!

17 Feb, 2021 13:20 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

చెన్నై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2021‌) మినీ వేలానికి టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియ‌న్ ప్లేయ‌ర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉండగా... మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయ‌ర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది ఆటగాళ్లను మాత్ర‌మే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏ టీమ్ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు ఉంది? ఏ టీమ్‌కు ఎంత మంది ప్లేయ‌ర్స్ తీసుకునే అవ‌కాశం ఉందో ఒక‌సారి పరిశీలిద్దాం.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 6
డ‌బ్బు :  రూ.19.9 కోట్లు

ఢిల్లీ క్యాపిట‌ల్స్
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 8
డ‌బ్బు:  రూ.13.04 కోట్లు 

పంజాబ్ కింగ్స్
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 9
డ‌బ్బు: రూ.53.2 కోట్లు

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 8
డ‌బ్బు:  రూ.10.75 కోట్లు

ముంబై ఇండియ‌న్స్ 
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 7
డ‌బ్బు:  రూ.15.35 కోట్లు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 9
డ‌బ్బు :  రూ.15.35 కోట్లు

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 14
డ‌బ్బు:  రూ.35.4 కోట్లు

స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌
వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 3
డ‌బ్బు:  రూ.10.75 కోట్లు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు