IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం!

7 Apr, 2022 12:14 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు ఏవిన్‌ లూయిస్‌ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం(ఏప్రిల్‌4)న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాహుల్‌ త్రిపాఠి కొట్టిన బంతిని ఆపే క్రమంలో లూయిస్‌ గాయపడ్డాడు.

దీంతో గురువారం(ఏప్రిల్‌7) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహాం నెలకొంది. ఒక వేళ అతడు మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో మరో కరీబియన్ ఆటగాడు కైల్‌ మైయర్స్‌ తుది జట్టులోకి అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన లూయిస్‌ 66 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక అర్థసెంచరీ కూడా ఉంది.

తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), మనీష్ పాండే, కైల్‌ మైయర్స్‌, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై/దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్‌

చదవండి: KKR Vs MI: అస్సలు ఊహించలేదు.. జీర్ణించుకోవడం కష్టమే.. కానీ: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు